దీపావ‌ళి విషెస్ చెప్ప‌డంలో 'లెక్కల బుర్ర' చూపించిన ద‌ర్శ‌కుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపావ‌ళి విషెస్ చెప్ప‌డంలో 'లెక్కల బుర్ర' చూపించిన ద‌ర్శ‌కుడు!

  • దీపావ‌ళికి, కీబోర్డుకి లింక్ పెట్టిన సుకుమార్‌
  • ఫేస్‌బుక్ పోస్టులో నిగూఢ అర్థం
  • వైర‌ల్ అవుతున్న పోస్ట్‌
ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమాలు చాలా వినూత్నంగా ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆయన సినిమాల్లో టైటిల్ కార్డ్స్ నుంచే త‌న క్రియేటివిటీని చూపిస్తాడు సుకుమార్‌. మ‌రి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్ప‌డంలో కూడా త‌న మార్కు చూపించాల‌నుకున్నాడేమో!... కీబోర్డుకి, దీపావ‌ళికి లంకె వేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ద‌ర్శ‌కుడిగా మార‌కముందు లెక్కల మాస్టారుగా ప‌నిచేసిన సుకుమార్ దీపావ‌ళి శుభాకాంక్షలను కూడా మ్యాథ్‌మేటిక్స్‌కి జతచేసి చెప్పాడు. అందులో ఉన్న నిగూఢమైన అర్థం నెటిజ‌న్లను ఆలోచింప‌జేస్తోంది. అందుకే ఆ ఫొటోను వైర‌ల్‌గా మారుస్తున్నారు.

'షిప్ట్ ప్లస్ డిలీట్ అని విద్యుత్ దీపాన్ని, కంట్రోల్ ప్లస్ ఎస్ అని దీపావళి ప్రమిదని పోస్ట్ చేసి హ్యాపీ దివాలి' అంటూ సుకుమార్ తన ఫేస్ బుక్ పేజీలో రాశారు. కీబోర్డులో 'షిప్ట్ డిలీట్‌` కొడితే డేటా మొత్తం డిలీట్ అవుతుంది... అంటే ఈరోజు కరెంట్ దీపాల నుండి వచ్చే వెలుగుని పూర్తిగా ఆపేయాల‌ని అర్థం. అలాగే 'కంట్రోల్ ఎస్‌` నొక్కితే ఫైల్ సేవ్ అవుతుంది. అంటే దీపాల నుండి వచ్చే కాంతులతో జగమంతా వెలుగు నింపాలని అర్థం.
deepavali
diwali
sukumar
creativity
facebook
photo
viral

More Telugu News